స్టార్ కిడ్స్ ని లాంచ్ చేయడంలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ట్రాక్ రికార్డ్ వేరు. మహేష్ బాబు, అల్లు అర్జున్.. ఇలా ఆయన లాంచ్ చేసిన హీరోలు సూపర్ స్టార్లుగా ఎదిగారు. ఇపుడు ఆయన మరో స్టార్ కిడ్ బాధ్యత తీసుకున్నారు. సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
సునీత కొడుకును హీరో చేయడం కోసం రాఘవేంద్రరావు ఆర్.కె. టెలీ షో పతాకంపై ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘సర్కారు నౌకరి’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొడుకుని హీరోగా చేయాలని చాలా కాలంగా ఆలోచించారు సునీత.
అయితే మొదటి సినిమా చాలా ముఖ్యం. అందుకే రాఘవేంద్రరావు హస్త వాసి పై నమ్మకంతో ఆయన చేతిలోనే పెట్టారు. మరి ఆకాష్ జాతకం ఎలా వుంటుందో చూడాలి.