ENGLISH

స్టార్ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి కన్నుమూత

27 January 2023-11:02 AM

స్టార్ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఆయన ఎన్నో ఏళ్ల నుంచి సినీ రంగానికి సేవలు అందిస్తున్నారు.

 

సూర్య, అజిత్‌, మోహన్‌లాల్‌, కార్తి‌, విక్రమ్‌తోపాటు పలువురు స్టార్‌ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్‌ చెప్పారు. సహాయనటుడిగానూ ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.