ENGLISH

భ‌ర్త కోసం కాజ‌ల్ రిక‌మెండేష‌న్లు

16 November 2021-13:00 PM

కాజ‌ల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లూ త్వ‌ర‌లోనే వెండి తెర‌పై కనిపించ‌నున్నాడా? - ఆ అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. త‌న చిననాటి స్నేహితుడు గౌత‌మ్ నికాజ‌ల్ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కాజ‌ల్ గ‌ర్భ‌వ‌తి కూడా. అందుకే కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటోంది. త్వ‌ర‌లో తాను మ‌ళ్లీ వెండి తెర‌పై క‌నిపించ‌బోతోంది. అయితే గౌత‌మ్ కూడా సినిమాల్లో న‌టించ‌బోతున్నాడ‌ని, త‌నకో ఛాన్స్ ఇప్పించ‌డానికి కాజ‌ల్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని టాలీవుడ్ టాక్.

 

గౌత‌మ్ కి న‌ట‌న‌పై ఆస‌క్తి ఉంది. ఈమ‌ధ్య కాజ‌ల్, గౌత‌మ్ క‌లిసి ఓ ప్ర‌మోష‌న్ వీడియో చేశారు. దీన్ని బ‌ట్టి... గౌత‌మ్ కి న‌టించాల‌న్న కోరిక ఉంద‌న్న విష‌యం స్ప‌ష్టం అవుతోంది. కాజ‌ల్ గ‌ట్టిగా రిక‌మెండేష‌న్ చేస్తే... త‌ప్ప‌కుండా గౌత‌మ్ కి ఛాన్సులు వ‌స్తాయి.కాక‌పోతే.. హీరోగా మాత్రం సెట్ అవ్వ‌డు. హీరో అన్న పాత్ర‌ల‌కైతే ఓకే. కాజ‌ల్ మాత్రం త‌న సినిమాలోనే గౌత‌మ్ కీ ఓ ఛాన్స్ ఇప్పించాల‌ని చూస్తోంది. అదెప్పుడు కుదురుతుందో చూడాలి మ‌రి.

ALSO READ: శ్యామ్ Vs గ‌ని... పోటీ మామూలుగా ఉండ‌దిక‌