ENGLISH

'ఇండియన్‌'కి చందమామ ఫిక్సయ్యింది.!

03 December 2018-17:19 PM

నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా. చందమామ విషయంలో అది నిజమైంది. విశ్వనటుడు కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'ఇండియన్‌ 2' (తెలుగులో 'భారతీయుడు 2') చిత్రంలో నటించే ఛాన్స్‌, చందమామని వరించిందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ఇప్పుడు నిజమైంది. అవును తాజాగా ఆ విషయం ఖరారైంది. చిత్ర యూనిట్‌ కాజల్‌ పేరును అధికారికంగా ఖరారు చేసింది. విజువల్‌ వండర్‌ 'రోబో 2.0'ని రూపొందించిన లైకా సంస్థ వారే 'ఇండియన్‌ 2'ని కూడా రూపొందిస్తున్నారు.

శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలిసారి కమల్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే ఛాన్స్‌ దక్కడంతో చందమామ ఆనందానికి అవధుల్లేవు. అలాగే ఆమె అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. కమల్‌హాసన్‌తో కలిసి నటించాలని చాలా మంది ముద్దుగుమ్మలు ఉబలాటపడుతుంటారు. కానీ అది అంత సులువుగా సాధ్యమయ్యే విషయం కాదు. ఇన్నాళ్లకు ఆ ఛాన్స్‌ దక్కించుకుంది కాజల్‌ అగర్వాల్‌. అసలే అందంలో చందమామ. ఇక ఈ చందమామ శంకర్‌ చేతిలో పడి, ఇంకెంత అందంగా ప్రకాశించేనో కదా.

శంకర్‌ సినిమాల్లో హీరోయిన్స్‌ చాలా చాలా అందంగా కనిపిస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి మన చందమామని శంకర్‌ ఎంతందంగా చూపిస్తాడో చూడాలిక. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మకీ చోటుందట. ఆ అందాల భామ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. ప్రస్తుతం సెట్‌ వర్క్స్‌ ఫాస్ట్‌గా జరుగుతున్నాయి.

ALSO READ: ఆదివారం అద‌ర‌గొట్టిన '2.O'