ENGLISH

గ్లామ్‌ షాట్‌: జామ్‌ జామ్‌.. గ్లామరస్‌ గులాబ్‌ జామ్‌

03 December 2018-17:14 PM

ఫొటోలోని బ్యూటీ ఎవరో తెలుసు కదా.! తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమానే అయినా, తనదైన ముద్ర వేసేసింది. ఎక్స్‌పోజింగ్‌ విషయంలో కట్టుదిట్టమైన నిబంధనల్ని తనకు తానే విధించుకున్న ఈ బ్యూటీ, తన నటనతోనే అవకాశాలు దక్కించుకుంటోంది. అక్కినేని నాగచైతన్య సరసన తెలుగులో ఈమె నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా అప్పట్లో పెద్ద విజయాన్నే అందుకుంది.

ఈ బ్యూటీ ప్రస్తుతం 'జామ్‌ జామ్‌' అనే సినిమాలో నటిస్తోంది. ఇది బాలీవుడ్‌ మూవీ 'క్వీన్‌'కి మలయాళ రీమేక్‌. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్‌, కన్నడలో పారుల్‌ యాదవ్‌ ఈ 'క్వీన్‌' రీమేక్స్‌లో నటిస్తోన్న సంగతి తెల్సిందే. ఎప్పుడూ ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా వుండే మంజిమ మోహన్‌, ఓ ఫొటోషూట్‌ కోసం ఇదిగో, ఇలా ఒకింత హాట్‌గా కన్పించింది అందరికీ షాకిచ్చింది.

మామూలుగా అయితే వల్గర్‌గా పోజులిచ్చే అందాల భామల నుంచి హాటెస్ట్‌ ఫొటోలొచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోరేమో. కానీ, మంజిమ లాంటోళ్ళ నుంచి ఓ మోస్తరు గ్లామర్‌ కన్పించినా, ఆ ఫొటో వైరల్‌ అయిపోతుంటుంది. అదే ఈ ఫొటో విషయంలో జరిగింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఫొటో సెగలు పుట్టిస్తోంటే, కలర్‌ ఫొటో ఇంకా కలర్‌ఫుల్‌గా కన్పిస్తోంది.

ALSO READ: Qlik Here Latest Photoshoot