ENGLISH

'కాజల్‌ కిచ్లు'.. చందమామ పేరు మారిందా.?

16 December 2020-18:55 PM

'సమంత రూత్‌ ప్రభు' కాస్తా, సమంత అక్కినేని అయ్యింది. అమ్మాయిలకు ఇంటిపేరు మారడం మామూలే. పేరు పక్కన 'పవర్‌' చేరితే ఎవరు మాత్రం కాదంటారు.? కొందరికి పాత పేరు, కొత్త పేరు కూడా వుంటుంది. 'ప్రియాంకా చోప్రా జోనాస్‌' అంటూ ప్రియాంకా చోప్రా పేరు మారింది. ఎవరిష్టం వాళ్ళది.

 

పెళ్ళయ్యాక పేరు మారిపోవాలన్న రూల్‌ అయితే వుండదు సెలబ్రిటీలకి. మరి, కాజల్‌ అగర్వాల్‌ పేరు సంగతేంటి.? ఆల్రెడీ 'కాజల్‌ కిచ్లు' అనే పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. కాజల్‌ కొత్త సినిమా 'ఆచార్య' టైటిల్‌ కార్డ్స్‌లో ఏ పేరు పడుతుంది.? కాజల్‌ అగర్వాల్‌ అని వుంటుందా.? కాజల్‌ కిచ్లు అని వుంటుందా.? గౌతమ్‌ కిచ్లుని పెళ్ళాడింది గనుక, కాజల్‌ కిచ్లు.. అని పెట్టుకుంటుందేమోనని కాజల్‌ అభిమానులే అంటున్నారు.

 

కాదు కాదు, కిచ్లు కాజల్‌ అగర్వాల్‌ అని వుంటుందనీ.. కాదు కాదు, కాజల్‌ కిచ్లు అగర్వాల్‌ అని వుండొచ్చనీ.. ఇవేవీ కాదు, కాజల్‌ అగర్వాల్‌ కిచ్లు అని వుంటే బావుంటుందనీ ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరి గోల వారిది. కాజల్‌ మాత్రం, అటు వైవాహిక జీవితాన్నీ, ఇటు సినిమా కెరీర్‌నీ బ్యాలెన్స్‌ చేసుకోవడంలో నిమగ్నమయ్యాననీ, తన భర్త తనను పూర్తిగా అర్థం చేసుకుంటాడనీ, పేరుతో అసలు సమస్యే లేదనీ చెబుతోంది. ఇటీవల హనీమూన్‌ ముగించుకున్న కాజల్‌ అగర్వాల్‌, 'ఆచార్య' షూటింగ్‌లో బిజీ బిజీ అయిపోయింది.

ALSO READ: Kajal Latest Photoshoot