ENGLISH

Kajal Aggarwal: కాజ‌ల్ అస్స‌లు త‌గ్గ‌డం లేదు

28 February 2023-11:00 AM

పెళ్ల‌య్యాక‌, ఓ బిడ్డ‌కు తల్ల‌య్యాక‌.. సాధార‌ణంగా హీరోయిన్ల‌కు క్రేజ్ త‌గ్గుతుంది.మెల్ల‌గా ఆంటీ త‌ర‌హా పాత్ర‌లొస్తాయి. హీరోయిన్లు కూడా క్ర‌మంగా సినిమాల‌కు దూరం అవుతారు. కానీ కాజ‌ల్ సీన్ రివ‌ర్స్. త‌ల్ల‌య్యాక‌... ఇంకాస్త జోరుగా సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించుకొంది. ప్ర‌స్తుతం ఇండియ‌న్ 2లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలో అవ‌కాశం అందుకొంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా కాజ‌ల్ ని ఎంచుకొన్నారు. ఈ సినిమాలో కాజ‌ల్ ది ప‌ద్ధ‌తైన పాత్ర అని తెలుస్తోంది.

 

సినిమా మొత్తం.. హుందాగా క‌నిపిస్తుంద‌ట‌. అలాంటి పాత్ర కోసం కాజ‌ల్ అయితే బాగుంటుంద‌ని ఆమెని తీసుకొన్నారు. బాల‌య్య - కాజ‌ల్ ల మ‌ధ్య డ్యూయెట్లు, రొమాన్స్ లాంటివి ఏం ఉండ‌వ‌ట‌. అందుకే కాజ‌ల్ కూడా ఈ సినిమా ఒప్పుకొంద‌ని స‌మాచారం. అయితే.. ఇందుకు గానూ.. ఏకంగా కోటి రూపాయ‌ల పారితోషికం అందుకొంద‌ని టాక్‌. ఈ రోజుల్లోకోటి రూపాయ‌ల పారితోషికం అంటే పెద్ద మేట‌రేం కాదు. కాక‌పోతే... వెట‌ర‌న్ హీరోయిన్‌కి కోటి రూపాయ‌లు ఇవ్వ‌డం మామూలు విష‌యం కాదు. పెళ్ల‌యి, తల్ల‌యినా కాజ‌ల్ క్రేజ్ త‌గ్గ‌లేద‌న‌డానికి ఇదే సాక్ష్యం