టాలీవుడ్ లో మరోసారి రీమిక్స్ పాటల ట్రెండ్ మొదలైయింది. ఇటివలే అమిగోస్ లో కళ్యాణ్ రామ్, బాలకృష్ణ ఎవర్ గ్రీన్ సాంగ్ ఎన్నో రాత్రులు వస్తాయి గానీ పాటని అమిగోస్ లో రీమిక్స్ చేశారు. చిరంజీవి భోళా శంకర్ లో రామ్మ చిలకమ్మా పాటని రీమిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా ఈ క్లబ్ లో చేశారు. అనిల్ రావిపూడితో బాలకృష్ణ ఒక మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం బాలకృష్ణ ట్రెండ్ సెట్టర్ మెలోడి అందాల ఆడబొమ్మ పాటని రీమిక్స్ చేస్తున్నారని తెలిసింది. సమరసింహా రెడ్డి సినిమాలో ఈ పాట ఒక ఊపు ఊపింది. మెలోడీ తో పాటు మంచి డ్యాన్స్ టచ్ వున్న నెంబర్ గా చార్ట్ బస్టర్ అయ్యింది. బాలకృష్ణ సిగ్నేచర్ స్టెప్స్ అలరించాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి మరోసారి ఆ మ్యాజిక్ ని వాడుకోబోతున్నాడు. ఈ ప్రాజక్టును సాహూ గారాపాటి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.