ENGLISH

నిర్మాతగా మారనున్న కాజల్‌, కండిషన్స్‌ అప్లయ్‌.!

26 December 2020-15:10 PM

కాజల్‌ అగర్వాల్‌ నిర్మాతగా మారబోతోందట.. అన్న ప్రచారం ఈనాటిది కాదు. కానీ, ఈసారి పక్కా.. అంటున్నారు. బ్యానర్‌ పేరు కూడా ఖరారయ్యిందట. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ బ్యానర్‌పై ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు ఓటీటీ కంటెంట్‌ నిర్మించాలనే తొందరలో వుందట కాజల్‌ అగర్వాల్‌. ఈ బాధ్యతలన్నీ కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు చూసుకుంటాడని సమాచారం. ఇటీవల కాజల్‌, తన భర్తతో కలిసి హైద్రాబాద్‌ వచ్చింది 'ఆచార్య' సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు. అలా తన భర్తని, కాజల్‌ టాలీవుడ్‌కి పరిచయం చేసిందన్నమాట.

 

తెలుగుతోపాటు కాజల్‌కి తమిళంలోనూ, హిందీలోనూ మంచి ఫాలోయింగ్‌ వుంది. తొలుత బాలీవుడ్‌లోనే ఓటీటీ కంటెంట్‌ ద్వారా 'కాజల్‌ - కిచ్లు' నిర్మాణ సంస్థ తొలి అడుగు వేయబోతోందని సమాచారం. ఈ మేరకు కంటెంట్‌ కూడా దాదాపుగా సిద్ధమయ్యిందట. అతి త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ వుండబోతోందని సమాచారం. దాన్ని తెలుగులోకి కూడా డబ్‌ చేయబోతున్నారట.

 

ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఓటీటీ కంటెంట్‌లో నటించబోయేది కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌ అట. నిషా అగర్వాల్‌ తెలుగుతోపాటు, తమిళంలోనూ ఒకటీ అరా సినిమాలు చేసింది. అయితే, హీరోయిన్‌గా సక్సెస్‌ అవలేకపోయింది. ముందు ఓటీటీ కంటెంట్‌, ఆ తర్వాత మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాల వైపు కాజల్‌ అడుగు వేయనుందని తెలుస్తోంది. అన్నట్టు, కాజల్‌ - కిచ్లు.. ఇప్పటికే 'ఇంటీరియర్‌ ప్రోడక్ట్స్‌' సంస్థని ప్రారంభిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషక్ష్మీం విదితమే.

ALSO READ: Kajal Latest Photoshoot