ENGLISH

'స‌లార్'‌.. అంత స్పీడా..?!

26 December 2020-14:04 PM

ప్ర‌భాస్ సినిమా అంటే.. క‌నీసం రెండేళ్లు సెట్స్‌పై ఉండ‌డం ఖాయం. ఎందుకంటే ప్ర‌భాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా వ్య‌వ‌హారం. బ‌డా స్టార్లు, భారీ సెట్లూ అవ‌స‌రం. అందుకే... అంత టైమ్ తీసుకుంటుంది. రాధే శ్యామ్ రెండేళ్లుగా సెట్స్‌పైనే ఉంది. ఇంకా షూటింగ్ జ‌రుగుతోంది. అదెప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో తెలీదు. `స‌లార్‌` కూడా పాన్ ఇండియా సినిమానే. కాక‌పోతే.. ఈసారి... లెక్క వేరేలా ఉండ‌బోతోంద‌ట‌.

 

`స‌లార్‌` సినిమా స్పీడు స్పీడుగా షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ని 2022 సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌డం ఖాయ‌మ‌ని, అందుకు త‌గ్గ‌ట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. 2021 జ‌న‌వ‌రిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఏక‌ధాటిగా నెల రోజుల పాటు షూటింగ్ జ‌రుపుతార్ట‌. ఈ సినిమాతో పాటుగానే `ఆది పురుష్‌` కూడా మొద‌ల‌వుతుంది. కాక‌పోతే.. `స‌లార్‌` షూటింగే ముందు పూర్త‌వుతుంది. న‌వంబ‌రు నాటికి `స‌లార్‌` షూటింగ్ అవ్వ‌గొట్టి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేస్తారు. సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి వ‌దులుతారు. ఇదంతా ప్లానింగ్ మాత్ర‌మే. ఇదంతా వ‌ర్క‌వుట్ అవుతుందా, లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. స‌లార్‌ని మాత్రం వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకోవ‌డం మాత్రం శుభ‌సూచ‌క‌మే.

ALSO READ: ష‌కీలా.... డీలా!