ENGLISH

ష‌కీలా.... డీలా!

26 December 2020-13:31 PM

ద‌క్షిణాదిని శృంగార సంద్రంలో ముంచిన తార‌.. ష‌కీలా. ఓ ద‌శ‌లో ష‌కీలా సినిమాలొస్తున్నాయంటే... సూప‌ర్‌స్టార్లు సైతం కంగారు ప‌డాల్సివ‌చ్చేది. ఆమె రేంజ్ అలా ఉండేది. ష‌కీలా ఆత్మ క‌థ‌.. ఇప్పుడు ష‌కీలా సినిమా పేరుతో తెర‌కెక్కింది. బాలీవుడ్ భామ రిచా చ‌ద్దా ష‌కీలా పాత్ర‌ పోషించింది. ఇంద్ర‌జిత్ లంకేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రాన్ని శుక్ర‌వారం విడుద‌లైంది.

 

హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేశారు. షకీలా సినిమా.. పైగా బోల్డ్ స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌ని.. రిచా చ‌ద్దా న‌టించింది. ఇంకేం... యువ‌త‌రం థియేట‌ర్ల ముందు క్యూ క‌ట్టేస్తుంద‌నుకున్నారంతా. కానీ... సినిమాకు క‌నీస స్పంద‌న క‌ర‌వైంది.

 

దేశ వ్యాప్తంగా తొలి రోజు ఈ సినిమా కేవ‌లం రూ.25 ల‌క్ష‌ల గ్రాస్ మాత్ర‌మే వ‌సూలు చేసిందంటే... ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. బూతు సినిమా అనే ముద్ర ప‌డ‌డం, స‌రైన ప‌బ్లిసిటీ లేక‌పోవ‌డం ఈ సినిమాని దారుణంగా దెబ్బ కొట్టాయ‌ని ట్రేడ్ విశ్లేష‌కులు తేల్చేశారు. క‌నీసం ష‌కీలా న‌టించిన బూతు సినిమాల‌కు ఉండే మైలేజీ కూడా ఈ సినిమాకి ద‌క్క‌లేద‌న్న‌ది ట్రేడ్ వర్గాల టాక్‌.

ALSO READ: రాశీఖ‌న్నాకి మ‌రో సూప‌ర్ ఛాన్స్‌