ENGLISH

రాశీఖ‌న్నాకి మ‌రో సూప‌ర్ ఛాన్స్‌

26 December 2020-12:00 PM

ఏడేళ్ల క్రితం `మ‌ద్రాస్‌కేఫ్‌`తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖ‌న్నా. ఆ సినిమా బాగానే ఆడినా... రాశీకి ఎందుకో అక్క‌డి నుంచి సరైన ఆఫ‌ర్లు రాలేదు. రాశీఖ‌న్నా కూడా ద‌క్షిణాది ఆఫ‌ర్ల‌తో సంతృప్తి ప‌డిపోయింది. మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్ లో త‌ను బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు మ‌రోసారి బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. సినిమా కోసం కాదు... ఓ వెబ్ సిరీస్ కోసం.

 

షాహిదీ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. రాజ్ డీకే ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తోంది. ఇందులో క‌థానాయిక పాత్ర‌లో రాశీఖన్నా క‌నిపించ‌బోతోంది. రాజ్ డీకే ఇది వ‌ర‌కు తీసిన `ఫ్యామిలీమెన్‌` సిరీస్ సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్ రెండో సిరీస్ కూడా పూర్తయ్యింది. ఆ వెంట‌నే మ‌రో ప్రాజెక్టులోకి ప‌డిపోయారు రాజ్ డీకే. ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

ALSO READ: Raashi Khanna Latest Photoshoot