ENGLISH

సొంతూరికోసం కల్కి దర్శకుడి భారీ విరాళం

13 August 2024-13:18 PM

కల్కి మూవీతో పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు నాగ అశ్విన్. కల్కి సినిమాకి మెయిన్ హీరో ఎవరు అంటే టక్కున నాగ అశ్విన్ పేరే చెప్తారు అంతా. క‌ల్కి మూవీతో 1200 కోట్లు కొల్లగొట్టి రికార్డ్స్ సృష్టించాడు. నెక్స్ట్ కల్కి 2 తో వస్తాడనుకుంటే, ప్రాజెక్ట్ S  అనే వర్కింగ్ టైటిల్ అప్డేట్ తో షాకిచ్చాడు. దీనితో కల్కి 2 ఇప్పటిలో లేదని అర్థమయ్యింది. ఇప్పుడు నాగ అశ్విన్ కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.            


దర్శకుడిగా ఉన్నత స్థాయికి  చేరుకున్నా, ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా, చిన్నప్పుడు తనకి విద్యా బుద్ధులు నేర్పిన  స్కూల్ ని, సొంతూరిని గుర్తు పెట్టుకుని తన వంతుగా భారీ విరాళమిచ్చాడు నాగ్ అశ్విన్. నాగ అశ్విన్ సొంత ఊరు తెలంగాణా రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఐతోల్‌ గ్రామం. ఇక్కడ ఉన్న స్కూల్ పునర్నిర్మాణానికి 66 లక్షలు విరాళంగా ఇచ్చారు. స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగ అశ్విన్ తన తల్లిదండ్రులతో కలిసి అటెండ్ అయ్యారు.


ఈ సందర్భంగా మాట్లాడిన అశ్విన్ భవిష్యత్తులో తన గ్రామంలో దేవాలయం నిర్మిస్తానని  తెలిపారు. అంతే కాదు మరిన్ని ధార్మిక కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. తన ఊరు రూపు రేఖల్ని మారుస్తానని, గ్రామస్తులకు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతామని హామీ ఇచ్చారు. సొంత ఊరి మేలు కోసం ఆలోచిస్తున్న అశ్విన్ ని నెటిజన్స్ వావ్ గ్రేట్ అంటున్నారు.