ENGLISH

షారుఖ్ ని వెనక్కి నెట్టిన శోభిత

13 August 2024-13:49 PM

నాగ చైతన్యతో పెళ్లి అన్న వార్తతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది శోభితా ధూళిపాళ.  అక్కినేని నాగ‌చైత‌న్య‌, శోభితా ధూళిపాళ నిశ్చితార్థం ఆగ‌స్టు 8న హైద‌రాబాద్‌లో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  నాగ్ ఈ విషయం అనౌన్స్ చేసిన వెంటనే శోభిత గురించి నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు. అప్పటివరకు టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు లేని శోభిత ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. శోభిత నేటీవ్ ప్లేస్ ఏంటి, ఏం చదువుకుంది, ఏం చేస్తుంది. ఎంత సంపాదిస్తోంది, ఎంత ఆస్తి ఉంది అని రక రకాలుగా సెర్చ్ చేయటం జరిగింది. దీనితో ఈ వన్ వీక్ లో అత్యంత ప్రజాధారణ పొందిన భారతీయ సినిమా నటీమణిగా ఇండియ‌న్ మూవీస్ డేటాబేస్ సర్వేలో రెండో ప్లేస్ లో నిలిచింది.  


IMDB మోస్ట్ పాపులర్ ఇండియన్ హీరోయిన్ గా మొదటి స్థానంలో న‌టి శార్వ‌రీ  నిలిచింది. శార్వరి నటించిన 'ముంజ్యా' విడుదల తర్వాత IMDB బ్రేక్‌అవుట్ స్టార్‌మీటర్ అవార్డును గెలుచుకోవ‌డంతో శార్వ‌రీ అగ్ర‌స్థానం పొందింది. రెండో స్థానంలో శోభిత దూళిపాళ ఉంది. కేవలం చైతుతో పెళ్లి కారణంగా టాప్ 2 లో నిలిచి, వరల్డ్ వైడ్ గా పేరున్న షారుక్ ఖాన్ కంటే ముందు ప్లేస్ లో ఉంది శోభిత. షారుఖ్ మూడో స్థానం సరి పెట్టుకోవాల్సి వచ్చింది. నాలుగో స్థానంలో   కాజ‌ల్‌ అగర్వాల్, ఐదో  స్థానంలో జాన్వీ క‌పూర్‌ నిలిచారు. లక్ష్య, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ టాప్ 10లో మిగిలిన స్థానాల్లో ఉన్నారు.