కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి ఓ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’తో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమాకి తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. 'అర్జున్ S/O వైజయంతి'అనే టైటిల్ పెట్టారు. వైజయంతి విజయశాంతి హిట్ సినిమా. ఇప్పుడు అదే క్యారెక్టర్ పేరుని ఈ సినిమా పెట్టారు.
బింబిసారతో మళ్ళీ ఫాంలోకి వచ్చాడు కళ్యాణ్ రామ్. డెవిల్ ప్రాజెక్ట్ మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు ఈ సినిమాపై చాలా నమ్మకంగా వున్నాడు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్‌లు పూర్తి అయ్యింది. విజయశాంతి పాత్రే ఇందులో చాలా కీలకం. సయీ మంజ్రేకర్ ఇందులో హీరోయిన్. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.
ALSO READ: నాని ధైర్యమైన మాట - కోర్ట్ పై అపార నమ్మకం!