ENGLISH

షూటింగ్ మొద‌ల‌వ్వ‌క‌ముందే టీజ‌ర్‌

01 November 2020-13:05 PM

సినిమా మొదలై, సగం షూటింగు పూర్త‌యినా కూడా.. టీజ‌ర్ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్న కాలం ఇది. అయితే... విచిత్రంగా షూటింగ్ మొద‌ల‌వ్వ‌క‌ముందే ఓ టీజ‌ర్ రాబోతోంది. అదీ.. క‌మ‌ల్ హాస‌న్‌ది. న‌వంబ‌రు 7న క‌మ‌ల్ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ న‌టిస్తున్న 232వ చిత్రానికి సంబంధించిన ఓ టీజ‌ర్ రాబోతోంది. ఖైదీతో ఆక‌ట్టుకున్న లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. విచిత్రం ఏమిటంటే... ఇప్ప‌టి వ‌ర‌కూ షూటింగ్ మొద‌ల‌వ్వ‌లేదు. కాక‌పోతే.. టీజ‌ర్ మాత్రం వ‌చ్చేస్తోంది. అదెలా అంటారా?

 

ఈ సినిమా కోసం ఇటీవ‌ల టెస్ట్ షూట్ చేశారు. అందులోని విజువ‌ల్స్‌కి, మంచి ఆర్‌.ఆర్ జోడించి... ఈ టీజ‌ర్‌ని కట్ చేశార్ట‌. మంచి ఆలోచ‌న క‌దా? అన్న‌ట్టు `భార‌తీయుడు 2`కి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ కూడా క‌మ‌ల్ పుట్టిన రోజున రావొచ్చ‌ని స‌మాచారం. మ‌రి అదేమిటో చూడాలి.

ALSO READ: ఒక్క పాత్ర‌... న‌లుగురు పోటీ!