ENGLISH

కమల్‌హాసన్‌ అలా చేస్తాడా?

15 March 2017-12:51 PM

కమల్‌హాసన్‌ అభ్యుదయ భావాలున్న వ్యక్తి. భార్య సారికకు దూరమయ్యాక, గౌతమితో ఆయన కొన్నాళ్ళు సహజీవనం కూడా చేశారు. అయితే తన కుమార్తె ప్రేమ విషయంలో మాత్రం కమల్‌హాసన్‌ అసహనం వ్యక్తం చేస్తున్నాడనే వార్తలు విస్మయం కలిగిస్తున్నాయి. కమల్‌ పెద్ద కుమార్తె శృతిహాసన్‌ తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. నటి మాత్రమే కాదు, ఆమె మంచి సింగర్‌ కూడా. మ్యూజిక్‌ కంపోజర్‌గానూ శృతిహాసన్‌కి పేరుంది. ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ రూపకల్పనలో బిజీగా ఉన్న శృతిహాసన్‌, ఆమె స్నేహితుడు మైఖేల్‌ లండన్‌ నుంచి ముంబై రావడం, ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతుండడంతో సన్నిహితుల నుంచి ఈ సమాచారం అందేసరికి కమల్‌హాసన్‌ ఆందోళన చెందాడట. తన పరువు బజార్న పడేయొద్దంటూ శృతిహాసన్‌ని కమల్‌హాసన్‌ హెచ్చరించాడని వార్తలు వినవస్తున్నాయి. అయితే కమల్‌ అలాంటివాడు కాదని, సినీ రంగంలో వచ్చే గాసిప్స్‌ గురించి అతనికి బాగా తెలుసని ఒకవేళ శృతిహాసన్‌ ఎవర్నయినా ప్రేమించినా, ఆయన కాదనే వ్యక్తి ఏమాత్రం కాదని ఆయన సన్నిహితులంటున్నారు. రాజకీయాలపై ఆయన ఈ మధ్య స్పందిస్తున్న విధానం చూసి, ఆయన వ్యతిరేకులే ఈ గాసిప్స్‌ ప్రచారం చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

ALSO READ: లంకలో అందాల రాశి మేటరేంటి?