ENGLISH

క‌మ‌ల్ హాస‌న్ షాక్ ఇవ్వ‌బోతున్నాడా?

06 March 2017-13:37 PM

సినీ స్టార్లు... రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌డం అక్క‌డా ఆధిప‌త్యం చూపించ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌య‌మే. త‌మిళ‌నాట ఈ ట్రెండ్ ఇంకాస్త ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అక్క‌డ సినీ రాజ‌కీయాల గురించి ఎప్పుడు మాట్లాడుకొన్నా ర‌జ‌నీకాంత్ పేరే చ‌ర్చ‌కు వ‌స్తుంటుంది. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా, రాడా?? అనేది ఇప్ప‌టికీ అక్క‌డ అతి పెద్ద క్వ‌చ్చ‌న్ మార్కే. ప్ర‌స్తుత త‌మిళ‌నాట రాజ‌కీయ ప‌రిస్థితులు ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ అరంగేట్రానికి అనుకూలంగా ఉన్నాయ‌ని అక్క‌డి మీడియా కూడా కోడై కూస్తోంది. అయితే అనూహ్యంగా మ‌రో స్టార్‌.. ఇప్పుడు రంగంలోకి దిగ‌బోతున్నాడు. త‌నే.. లోక నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్‌.

అవును.. క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయ ఎంట్రీకి దాదాపుగా రంగం సిద్ధ‌మైంద‌ని, త్వ‌ర‌లోనే క‌మ‌ల్ నుంచి ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఆదివారం అంతా క‌మ‌ల్‌హాస‌న్ త‌న స‌న్నిహితుల‌తోనూ, అభిమాన సంఘాల నాయ‌కుల‌తోనూ ద‌ఫ‌ల వారీగా చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, అది క‌చ్చితంగా పొలిటిక‌ల్ ఎంట్రీ గురించే అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మరి క‌మ‌ల్ మ‌న‌సులో ఏముందో?? త‌న వ్యూహాలు ఏమిటో తెలియాలంటే... ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

ALSO READ: బాహుబలికి మెగాస్టార్ కి ఎటువంటి సంబంధం లేదు: రాజమౌళి