పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పడప్పుడే డార్లింగ్ డైరీ ఖాళీ అయ్యేటట్టు లేదు. అయినా ప్రభాస్ కోసం వరుస కథలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ సినిమాల్లో ఏక కాలంలో వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ సందీప్ వంగాతో స్పిరిట్ ఉంది. సలార్ 2, కల్కి 2 కూడా పెండింగ్ లో ఉన్నాయి. ప్రభాస్ కి ఉన్నక్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హోంభలే ప్రొడక్షన్స్ మూడు సినిమాలకి ఒప్పందం చేసుకుంది. అందులో ఒకటి సలార్ 2 , రెండో సినిమా కోసం కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ లోకేష్ కనక రాజ్ పేరు వినిపిస్తోంది.
ఇక మూడో సినిమాకోసం కాంతారా హీరో రిషబ్ శెట్టి రంగంలోకి దిగాడంట. ప్రభాస్ తో నటించటానికి కాదు కథ అందిస్తున్నాడట. రిషబ్ ఇప్పటికే హోంబాలే ఫిలిమ్స్ తో కలిసి "కాంతార 2" కి వర్క్ చేస్తున్నాడు. ప్రభాస్ కోసం కథలు వెతుకుతున్న క్రమంలో రిషబ్, ప్రభాస్ కి మ్యాచ్ అయ్యే ఒక పవర్ఫుల్ కథను చెప్పారట. అన్నీ కుదిరితే హోంభలే వాళ్ళు ఒప్పుకుంటే దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు అని సమాచారం. కాంతారాతో దర్శకుడిగా రిషబ్ బెస్ట్ అనిపించుకున్నారు.
దర్శకుడిగా ప్రశాంత్ వర్మ పేరు కూడా వినిపిస్తోంది. ప్రశాంత్ కూడా ప్రభాస్ తో ఒక సినిమా చేయ నున్నట్లు చెప్తూనే ఉన్నాడు. పైగా జై హనుమాన్ కోసం రిషబ్, ప్రశాంత్ కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ సాన్నిహిత్యంతో నెక్స్ట్ డార్లింగ్ సినిమాకి ఈ ఇద్దరు కలిసి వర్క్ చేసే ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్, హోంబలే కాంబోలో రిషబ్ అందించిన కథకి ఎవరు డైరక్టరో అన్నది ఆసక్తి గా మారింది.
ALSO READ: RC16 లో బాలీవుడ్ స్టార్ హీరో?