ENGLISH

వైరలవుతున్న మంచు మనోజ్ పోస్ట్

10 December 2024-14:27 PM

గత కొన్నాళ్ళగా మంచు వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విష్ణు, మోహన్ బాబులకు దూరంగా ఉంటున్నాడు మనోజ్. అయితే తాజాగా మరొకసారి వీరి వివాదాలు ముదిరి రోడ్డున పడ్డాయి. చివరికి పోలీసు స్టేషన్ లో తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మొదట మనోజ్ పెళ్లి విషయంలో విభేదించిన మోహన్ బాబు మనోజ్ ని దూరం పెట్టారు. ఇప్పడు ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారని సమాచారం.

శనివారం వీరి మధ్య గొడవలు జరగగా, ఆదివారం మనోజ్ హాస్పటల్ కి వెళ్లారు. మనోజ్ దెబ్బలు చూసిన డాక్టర్లు అనుమానంతో పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటంతో ఈ విషయాలు వెలుగు చూశాయి. వెంటనే అదేం లేదు అదంతా పుకార్లు అంటూ కొట్టి పడేసారు మోహన్ బాబు. కానీ సోమవారం ఇద్దరు ఒకరి పై ఒకరు పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్ లో కంప్లైట్ చేసుకున్నారు. మనోజ్ తన పై దాడి జరిగిందని పది మందిపై పిర్యాదు చేయగా, మోహన్ బాబు మనోజ్, అతని భార్య మౌనిక వలన తనకి ప్రాణ హాని ఉందని కంప్లైన్ట్ ఫైల్ చేసారు. దీనితో పోలీసులు మనోజ్, మౌనిక పై కేసు ఫైల్ చేసారు.

ఈ విషయంపై స్పందిస్తూ మనోజ్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. 'నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు అబద్ధం. ఎవరిపై ఆధారపడకుండా సమాజంలో ఎంతో గౌరవంగా ఉంటున్నాం. కుటుంబం దగ్గర ఎప్పుడు చెయ్యి చాపలేదు. ఆస్తులు అడగాలన్న ఆలోచన కూడా లేదు. కావాలనే నాపై, నా భార్య పై ఆరోపణలు చేస్తున్నారు. మోహన్ బాబు తమని వేదిస్తున్నట్టు ఆధారాలున్నాయి అన్నారు మనోజ్. ఈ పోస్ట్ లో చాలా విషయాలు పొందు పరిచాడు మనోజ్. ప్రజంట్ మనోజ్ రాసిన లేఖ వైరలవుతోంది.

ALSO READ: ప్రభాస్ కోసం కాంతారా కథ?