ENGLISH

కత్తిలాంటి స్టిల్‌ అదిరింది గురూ.!

21 September 2018-12:49 PM

కత్రినా స్టిల్‌ ఇస్తే అంతే మరి. ఎలాంటి వారైనా చిత్తు చిత్తు కావల్సిందే. అలాంటి అందం కత్రినా కైఫ్‌ సొంతం. తెలుగులో 'మల్లీశ్వరి' చిత్రంతో తెరంగేట్రం చేసింది. మోడలింగ్‌ రంగం నుండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ 'మల్లీశ్వరి' సినిమా విషయంలో చాలా విమర్శలు అందుకుంది. యాక్టింగ్‌ రాదు, డాన్సులు అస్సలు రావు.. అంటూ. కానీ సినిమా మంచి విజయం అందుకుంది. గ్లామర్‌ విషయంలో కుర్రోళ్లకు రాత్రీ పగలు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ తర్వాత ఒకటీ అరా తెలుగు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడికెళ్లాక మన మల్లీశ్వరిలో వచ్చిన మేకోవర్‌కి అందరూ ఆశ్చర్యపోయారు. ఏమి డాన్సులు, ఏమి యాక్టింగ్‌ స్కిల్స్‌. ఇరగదీసేసిందంతే. మళ్లీ టాలీవుడ్‌ వైపు తిరిగి చూడలేదు కదా. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ప్రస్తుతం అమీర్‌ఖాన్‌తో 'థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌' సినిమాలో నటిస్తోంది. అరేబియన్‌ పైరేట్స్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌, 'దంగల్‌' ఫేం ఫాతిమా సనాషేక్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ALSO READ: 'దేవదాస్‌' సీక్వెల్‌ చేయాలనుంది - నాగ్‌