ENGLISH

పవన్‌ కళ్యాణ్‌ సరసన కీర్తి సురేష్‌?

09 September 2020-12:00 PM

పవన్‌ కళ్యాణ్‌ సరసన కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించబోతోందంటూ క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కబోతోన్న సినిమా గురించి గతంలో ప్రచారం జరిగిన విషయం విదితమే. అయితే, ఇప్పటిదాకా ఈ విషయమై ఆ చిత్ర దర్శక నిర్మాతలు స్పందించలేదు. అసలు హీరోయిన్‌ ఎవరన్నదానిపై ఇప్పటిదాకా ఓ స్పష్టత లేదు. ఆ మాటకొస్తే, ‘వకీల్‌సాబ్‌’ సినిమాలో హీరోయిన్‌ ఎవరు.? అన్నదానిపైనా ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. మరోపక్క, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం పవన్‌ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్దే పేరు ప్రచారంలో వున్న విషయం విదితమే.

 

తాజాగా కీర్తి సురేష్‌ పేరు తెరపైకొచ్చింది. మరోపక్క, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించే సినిమా కోసం పవన్‌ సరసన కీర్తి సురేష్‌ పేరు ఖరారయ్యిందంటూ కొత్త గాసిప్‌ బయల్దేరింది. ఒకటా.? రెండా.? ఏకంగా నాలుగు సినిమాలకి కీర్తి సురేష్‌ పేరు ప్రచారంలోకి వచ్చినా, ఇంతవరకూ ఏదీ ఖరారు కాకపోవడం గమనార్హం. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అజ్ఞాతవాసి’లో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. పవన్‌ పట్ల కీర్తి సురేష్‌కి చాలా ప్రత్యేకమైన గౌరవం వుంది. ఆమెను అప్రోచ్‌ అయితే, ఏ ప్రాజెక్ట్‌కి అయినాసరే, ఆమె కాదనకపోవచ్చు. ప్రస్తుతానికైతే కీర్తి, వరుస సినిమాలతో బిజీగా వుంది తెలుగులోనూ, తమిళంలోనూ.

ALSO READ: పుష్ఫ‌లో నారా రోహిత్‌?