ENGLISH

రెమ్యునిరేషన్ పై కీర్తి సురేష్ కామెంట్

27 March 2023-10:08 AM

నాని, కీర్తి సురేష్ లది హిట్ జోడి. నేను లోకల్ సినిమాలో బాబు, పొట్టిగా అలరించారు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ దసరా చేశారు. ఇందులో వెన్నెల పాత్రలో కనిపించబోతుంది కీర్తి. తాజాగా తన పాత్ర గురించిన విశేషాలని పంచుకుంది. మహానటి తర్వాత అంత కనెక్టయి చేసిన సినిమా దసరా, సినిమా పుర్తయిన తర్వాత కూడా వెన్నెల పాత్ర వెంటాదిందని చెప్పుకొచ్చారు.

 

ఇదే సందర్భంలో పాన్ ఇండియా సినిమాలు, హీరోల రేమ్యునిరేష్ అనే ప్రస్తావన వచ్చింది. పాన్ ఇండియా సినిమాలకి హీరోలు రేమ్యునిరేషన్ పెంచి తీసుకుంటున్నారు. మరి హీరోయిన్స్ కి కూడా పెంచి ఇస్తున్నారా ? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ''ఒకేసారి అలా ఎలా పెంచి ఇస్తారు. ఈ మార్పు రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ మార్పు వచ్చినపుడు పెంచమని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు'' అని చెప్పుకొచ్చింది కీర్తి.