ENGLISH

నాటునాటు ఆస్కార్ కారణం అజయ్‌ దేవ్‌గణ్‌

27 March 2023-09:34 AM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని నాటునాటు పాటకు ‘ఆస్కార్‌’ రావడం పై బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన వల్లే నాటునాటు పాటకు ఆస్కార్‌ వచ్చిందంటూ సరదాగా కామెంట్ చేశారు. ఇంతకీ ఏం జరిదిందంటే.. తన తదుపరి చిత్రం ‘భోలా’ ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్‌ శర్మ షోలో పాల్గోన్నారు అజయ్. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆస్కార్‌ వచ్చింది కదా. అందులో మీరూ నటించారు కాబట్టి ఆ సినిమాకు సంబంధించి ఏదైనా విశేషాలు పంచుకోగలరు?’’ అని వ్యాకపిల్ శర్మ కోరగా దీనిపై అజయ్‌ స్పందిస్తూ.. ‘‘నా వల్లే ఆస్కార్‌ వచ్చింది. ఒకవేళ నేనే ఈ పాటకు డ్యాన్స్‌ చేసుంటే ఏమయ్యేదో తెలుసుగా..!’’ అంటూ సరదాగా నవ్వులు పూయించారు. ఆయన మాటతో ఆ షోలో ఉన్న వారందరూ పగలబడినవ్వారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ లో అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.