ENGLISH

మహేష్ టైటిల్‌: అమ‌రావ‌తికి అటూ.. ఇటూ!

25 March 2023-13:48 PM

మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఉగాదికి టైటిల్ రివీల్ చేస్తార‌ని అనుకొన్నారంతా. కానీ చిత్ర‌బృందం నుంచి ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రాలేదు.

 

త్రివిక్ర‌మ్ టైటిళ్ల వేట‌లో ఉన్నాడ‌ని, క‌థ‌కు స‌రిప‌డా టైటిల్ దొర‌కలేదని, అందుకే ఇంకా ప్ర‌క‌టించ‌లేదని మ‌హేష్ ఫ్యాన్స్ స‌ర్దుకుపోతున్నారు. అయితే. ఈ సినిమా టైటిల్ ఫిక్స‌యిపోయింద‌ని స‌మాచారం. `అమ‌రావ‌తికి అటూ ఇటూ` అనే టైటిల్ ని త్రివిక్ర‌మ్ ఫిక్స్ చేశాడ‌ని... దీన్నే ఖ‌రారు చేసే అవ‌కాశాలు పుష్క‌లంగాఉన్నాయ‌ని తెలుస్తోంది. త్రివిక్ర‌మ్‌కి `అ` సెంటిమెంట్ ఎక్కువ‌. ఆయన సినిమా అన‌గానే `అ`తో మొద‌ల‌య్యే టైటిళ్లే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ ఈ పేరు ఖ‌రారు చేశార‌ని చెప్పుకొంటున్నారు. ఉగాదికి ఈ టైటిల్ ప్ర‌క‌టిద్దామ‌నుకొన్నారు. కానీ లోగో ఇంకా రెడీ కాక‌పోవ‌డంతో ఆగారు. రేపు రాబోయే శ్రీ‌రామ‌న‌వ‌మికి ఈ టైటిల్ రివీల్ చేసే అవ‌కాశాలున్నాయి.