ENGLISH

దసరా లో అంత వైలెన్స్ ఉందా ?

25 March 2023-11:09 AM

నాని తొలి పాన్ ఇండియానే కాదు తొలి ఊరమాస్‌ చిత్రం దసరా. ఇటీవల ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యూఏ (UA) సర్టిఫికెట్‌ జారీ చేసిన సెన్సార్‌ బోర్డు సబ్‌టైటిల్స్‌సహా అసభ్యకరమైన సంభాషణలకు ‘మ్యూట్‌’ పెట్టాలని, వైలెన్స్‌ అధికంగా ఉన్న సన్నివేశాలను సీజీ తో కవర్‌ చేయాలని చిత్ర బృందానికి సూచించింది. మొత్తంగా 16 కట్స్‌ చెప్పింది. ఈ సినిమా నిడివి 2 గంటల 39 నిమిషాలు.

 

ట్రైలర్ క్యురియాసిటీ పెంచడంతో ‘దసరా’పై అందరిలో ఆసక్తి నెలకొంది. సింగరేణి సమీపాన ఉండే వీర్లపల్లి గ్రామం నేపథ్యంలో నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాని తెరకెక్కించారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరిగుతున్నారు నాని.