ENGLISH

'అల్లరి పిల్ల' ఈ సారైనా హిట్‌ కొడుతుందా మరి.!

17 October 2018-18:15 PM

'మహానటి' సినిమాతో తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి, నటిగా మంచి పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌. తదుపరి తెలుగులో కొత్త సినిమాలు ఒప్పుకోలేదు కానీ, తమిళంలో చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. 

'మహానటి' తర్వాత తమిళ అగ్రహీరోల్లో ఒకరైన విక్రమ్‌తో నటించిన 'సామి స్క్వేర్‌'లో నటించింది కీర్తిసురేష్‌. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కీర్తికి ఆశించిన రిజల్ట్‌ అందించలేదు. తాజాగా 'పందెంకోడి 2'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌లో కీర్తిసురేష్‌ క్యారెక్టర్‌ని అల్లరి పిల్లగా చూపించారు. పక్కా మాస్‌ క్యారెక్టర్‌ అది. క్లాస్‌ అండ్‌ కూల్‌ క్యారెక్టర్‌లో కీర్తిసురేష్‌ని చూసిన ప్రేక్షకులు 'మహానటి'తో ఆమె నటనలోని విశ్వరూపాన్ని చూశారు. అందుకే ఆమె పేరులో ఉన్న కీర్తినంతటినీ ఆ పాత్ర సంపాదించి పెట్టింది కీర్తిసురేష్‌కి. 

మొదట విమర్శించివారు సైతం సినిమా చూశాక ప్రశంసల జల్లు కురిపించారు కీర్తిపై. అలాంటి కీర్తిసురేష్‌ నుండి వస్తోన్న 'పందెంకోడి 2' సినిమాలో అల్లరి పిల్లగా కీర్తిసురేష్‌ నటన ఎలా ఉండబోతోందో అంటూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. విశాల్‌ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ 'పందెంకోడి'కి సీక్వెల్‌గా రూపొందుతోందీ చిత్రం. మొదటి పార్ట్‌లో మీరా జాస్మిన్‌ పోషించిన పాత్రలో కీర్తిసురేష్‌ కనిపించనుంది. ఈ పాత్రతో కీరి నటనలోని మరో యాంగిల్‌ని చూడబోతున్నామట. 

అయితే కీర్తిసురేష్‌కి ఏ రేంజ్‌ హిట్‌ని దక్కిస్తుందో 'పందెంకోడి 2' చూడాలి మరి.

ALSO READ: బాపూబొమ్మట బౌన్స్‌ బ్యాక్‌ అవుతుందట.!