ENGLISH

కేజీఎఫ్ న‌టుడి క‌న్నుమూత‌

07 May 2022-17:02 PM

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు మోహ‌న్ జునేజా క‌న్నుమూశారు. జునేజా అంటే మ‌న‌వాళ్ల‌కు ఎవ‌రికీ తెలియ‌క‌పోవొచ్చు. కానీ కేజీఎఫ్ జునేజా అంటే మాత్రం ట‌క్కున గుర్తు ప‌ట్టేస్తారు. `గ్యాంగ్‌తో వ‌చ్చేవాడు గ్యాంగ్ స్ట‌ర్‌.. కానీ వాడొక్క‌డే వ‌స్తాడు. మాన్‌స్ట‌ర్‌` అంటూ కేజీఎఫ్‌లోని హీరో పాత్ర‌ని ఎలివేట్ చేస్తూ ఓ డైలాగ్ ఈ సినిమాలో ఉంది. అది ప‌లికిన‌వాడే... జునేజా.

 

ఆ ఒక్క సీన్‌తో జునేజా చాలా పాపుల‌ర్ అయిపోయాడు. చాలా కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న జునేజా ఈరోజు ఉద‌యం బెంగ‌ళూరులోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు. దాదాపుగా 150 సినిమాల్లో న‌టించారు జునేజా. ఎక్కువ‌గా కామెడీ పాత్ర‌లే చేశారు. కేజీఎఫ్‌లో చిన్న పాత్ర‌లో క‌నిపించిన ఆయ‌న న‌ట‌న గుర్తుండిపోతుంది. టీవీ సీరియ‌ల్స్‌లోనూ.. న‌టించారు. దాంతో కుటుంబ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యార‌కు. జునేజా మ‌ర‌ణ‌వార్త‌తో క‌న్న‌డ సీమ‌లో విషాదం చోటు చేసుకుంది. ప‌లువురు న‌టీన‌టులు ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళి అర్పించారు. జునేజా అంత్య‌క్రియ‌లు ఈ రోజు బెంగ‌ళూరులోని త‌మ్మెన‌హ‌ళ్లిలో నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

ALSO READ: ఆచార్య న‌ష్టాల‌న్నీ చిరుపై ప‌డుతున్నాయా?