ENGLISH

తిరుప‌తిలో న‌య‌న‌తార పెళ్లి?

07 May 2022-16:00 PM

న‌య‌న‌తార పెళ్లి అనేది అంతులేని టాపిక్‌. ఎవ‌రూ ఛేదించ‌లేని ఫ‌జిల్‌. న‌య‌న పెళ్లెప్పుడు? అనే ప్ర‌శ్న‌... అరిగిపోయిన పాత రికార్డు లాంటిదే. విన్న వాళ్ల‌కూ, అడిగిన వాళ్ల‌కూ, ఆఖ‌రికి న‌య‌న‌కూ విసుగొచ్చేసిన మాట‌. అయితే... ఇప్పుడు నిజంగానే న‌య‌న పెళ్లికి సిద్ధ‌మైపోయింది. పెళ్లి ముహూర్తం కూడా దాదాపుగా ఖ‌రారైపోయింద‌ని టాక్‌.

 

విఘ్నేష్ శివ‌న్‌తో న‌య‌న చాలాకాలం నుంచి స‌హ జీవనం చేస్తోంది. ఇద్ద‌రూ క‌లిసే ఉంటున్నారు. ఇద్ద‌రికీ ర‌హ‌స్యంగా పెళ్ల‌యిపోయింద‌ని కూడా వార్త‌లొచ్చాయి. అయితే ఇప్పుడ నిజంగానే వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఈమ‌ధ్య న‌య‌న‌, విఘ్నేష్‌ల జంట‌.. పుణ్య‌క్షేత్రాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తోంది. తిరుప‌తి కూడా వెళ్లొచ్చారు. ఇప్పుడు అక్క‌డే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార్ట‌. జూన్ 9న తిరుప‌తిలో వీళ్ల పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని స‌మాచారం అందుతోంది. తిరుప‌తిలో వేదిక కూడా ఫిక్స‌య్యింద‌ని, త్వ‌ర‌లోనే మిత్రుల‌కు, సన్నిహితుల‌కు న‌య‌న స‌మాచారం అందిస్తుంద‌ని, ఈ వేడుక‌కు అతి కొద్ది మంది మాత్ర‌మే హాజ‌ర‌వుతార‌ని టాక్. ఈసారైనా న‌య‌న పెళ్లి జ‌రుగుతుందా? లేదంటే.. మ‌రోసారి ఇది ప్రశ్న‌గానే మిగిలిపోతుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: ఆచార్య న‌ష్టాల‌న్నీ చిరుపై ప‌డుతున్నాయా?