ENGLISH

ఏంటి దేవి.. నువ్వు కూడా..?!

13 April 2021-16:00 PM

సంగీత ద‌ర్శ‌కుల‌కు బ‌ద్ద‌క‌మో ఏమో... పాత ట్రాకుల్ని మ‌ళ్లీ అటూ ఇటూ మార్చి వాడేస్తుంటారు. ఈ విష‌యంలో త‌మ‌న్ చాలాసార్లు దొరికేశాడు. ఇప్పుడు దేవిశ్రీ ప్ర‌సాద్ వంతు వ‌చ్చింది. ర‌వితేజ న‌టించిన `ఖిలాడీ` టీజ‌ర్ ఉగాది సంద‌ర్భంగా విడుద‌లైంది. టీజ‌ర్ కి వ‌చ్చిన రెస్పాన్స్ అయితే బాగుంది. కానీ.. అందులో దేవిశ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన ఆర్‌.ఆర్‌.. అయితే.. ఇప్పుడు కాపీ ముద్ర మోస్తోంది.

 

ఓసారి ఆ ఆర్‌.ఆర్ వింటే `బాగుందే` అనిపిస్తుంది. ఇంకోసారి విన‌గానే `ఎక్క‌డో విన్న‌ట్టుందే` అనే డౌటు వ‌స్తుంది. ఈ టీజ‌ర్ కోసం దేవిశ్రీ ఇచ్చిన బీజియ‌మ్.... `ఖైదీ నెం 150` కోసం ఇచ్చిన బీజియ‌మ్ రెండూ ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ఈ విష‌యాన్ని నెటిజ‌న్లు ప‌ట్టేశారు. ఏంటి దేవి.. నువ్వు కూడా కాపీనా? అంటూ కూపీ లాగేస్తున్నారు. ఖైదీ నెం.150 కి కూడా.. దేవిశ్రీ నే సంగీత ద‌ర్శ‌కుడు. త‌న ట్రాక్ ని తానే వాడేసుకున్నాడ‌న్న‌మాట‌. టీజ‌ర్‌కే ఇంత కాపీ అంటే.. రేపు పాట‌లు ఎలా ఉంటాయో,..??

ALSO READ: 'కింగ్ మేక‌ర్‌'గా చిరంజీవి?