ENGLISH

ఖిలాడీ క‌న్‌ఫ్యూజ్ చేస్తున్నాడే..?!

13 April 2021-14:00 PM

ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ చేసిన సినిమా.. ఖిలాడీ. ర‌వితేజ‌తో `వీర‌` తీసిన ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల `రాక్ష‌సుడు` సినిమాతో హిట్ కొట్టింది.... ఈ ద‌ర్శ‌కుడే. కాబ‌ట్టి `ఖిలాడీ`పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఉగాది సంద‌ర్భంగా విడులైన టీజ‌ర్ కూడా ఆ అంచ‌నాల్ని పెంచే విధంగా ఉంది. ర‌వితేజ పాత్ర కొత్త‌గా ఉండ‌బోతోంద‌న్న విష‌యాన్ని టీజ‌ర్ చెప్ప‌క‌నే చెప్పేసింది.

 

అయితే.. ఈ టీజ‌ర్ చూస్తే బోలెడ‌న్ని డౌట్లు వ‌చ్చేస్తాయి. ఇందులో ర‌వితేజ హీరోనా? విల‌నా? అనే ప్ర‌శ్న మెదులుతుంది అంద‌రిలోనూ. ఎందుకంటే... టీజ‌ర్ లో ర‌వితేజ ని ఓ సైకో కిల్ల‌ర్ గా చూపించాడు ద‌ర్శ‌కుడు. అన్న‌ట్టు ఈ సినిమాలో ఇద్ద‌రు ర‌వితేజ‌లున్నారు. ఒక‌రు.. ఇలా సీరియ‌ల్ కిల్లింగ్స్ చేస్తుంటే, మ‌రో హీరో ఏం చేస్తుంటాడ‌న్న‌ది ఇంకా పెద్ద మిస్ట‌రీగా మారింది.

 

ఈ సినిమాలో అర్జున్ ఓ కీల‌క పాత్ర పోషించారు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ అర్జునే ఈ సినిమా విల‌న్ అనుకున్నారు.కానీ ఇప్పుడు ర‌వితేజ‌నే విల‌న్ అనిపిస్తోంది. మ‌రి.. అస‌లు ట్విస్ట్ ఏమిటో తెలియాలంటే సినిమా వ‌చ్చేంత వ‌ర‌కూ ఆగాలి.

ALSO READ: లెక్క‌లు చెప్పొద్దంటూ దిల్ రాజు వార్నింగ్‌