ENGLISH

వ‌కీల్ సాబ్ కి ఇంకో 30 కోట్లు కావాలి

13 April 2021-12:15 PM

వ‌కీల్ సాబ్ గా... ప‌వ‌న్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. క‌రోనా వేవ్స్ బ‌లంగా ఉన్నా కూడా.. అభిమానుల అండ‌తో... భారీ వ‌సూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లో ఏకంగా 58 కోట్ల షేర్ వ‌సూలు చేసి - బ‌య్య‌ర్ల‌ను సంతోష పెట్టింది. మంగ‌ళ‌, బుధ వారాలు సైతం వ‌కీల్ సాబ్ కి క‌లిసొచ్చే విష‌యం. ఎందుకంటే... ఈ రెండూ సెల‌వ దినాలే. ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు థియేట‌ర్ల‌కు వ‌చ్చే ఛాన్సుంది. కాబ‌ట్టి.. వ‌కీల్ సాబ్ వ‌సూళ్లు స్డ‌డీగా ఉండే అవ‌కాశాలున్నాయి. ఈ సినిమా థియేట‌రిక‌ల్ రైట్స్ 90 కోట్లకు అమ్ముడ‌య్యాయి. అంటే.. ఇంకో 30 కోట్లు సాధిస్తే... బ్రేక్ ఈవెన్ అందుకున్న‌ట్టే.

 

వ‌కీల్ సాబ్ తొలి మూడు రోజుల వ‌సూళ్లు

 

నైజాం 16.00 కోట్లు
సీడెడ్  8.25 కోట్లు
ఉత్తరాంధ్ర 7.70 కోట్లు
ఈస్ట్ 4.30 కోట్లు
వెస్ట్ 5.70 కోట్లు
గుంటూరు 4.85 కోట్లు
కృష్ణా 3.25 కోట్లు
నెల్లూరు 2.40 కోట్లు
ఏపీ + తెలంగాణ 52.45 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా  2.40 కోట్లు
ఓవర్సీస్  3.20 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 58.05 కోట్లు

ALSO READ: లెక్క‌లు చెప్పొద్దంటూ దిల్ రాజు వార్నింగ్‌