ENGLISH

కైరా అద్వానీ.. కిర్రాకు పుట్టించనీ..

20 October 2020-10:00 AM

సీనియర్‌ హీరో అక్షయ్‌కుమార్‌ సరసన స్టన్నింగ్‌ బ్యూటీ కైరా అద్వానీ అదరగొట్టేస్తోంది. ‘లక్ష్మీ బాంబ్‌’ ప్రోమోస్‌లో కైరా అద్వానీ సొగసులకు యంగ్‌స్టర్స్‌ ఫిదా అవుతున్నారు. తెలుగులో ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన కైరా అద్వానీ, ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలకే పరిమితమైపోయిన విషయం విదితమే. బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ ఛెయిర్‌కి ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి వున్నా, ఆమె జోరు చూస్తోంటే.. ఆ రోజెంతో దూరం లేదనే అన్పిస్తోంది. పైగా, అక్షయ్‌కుమార్‌ హీరోగా సినిమా వస్తోందంటే.. ఆ సినిమా రేంజ్‌ అటోమేటిక్‌గా ఇంకో స్థాయికి వెళ్ళిపోతుంది.. సక్సెస్‌, ఫెయిల్యూర్‌కి అతీతంగా.

 

ఇదే విషయమై కైరా అద్వానీని ప్రశ్నిస్తే, ‘నెంబర్‌ ఈక్వేషన్స్‌ నాకు తెలియవ్‌..’ అని ఒక్క మాటలో సమాధానమిచ్చేసింది. బాలీవుడ్‌ వర్గాల అంచనా ప్రకారం, కైరా అద్వానీ.. బాలీవుడ్‌లో చాలామంది స్టార్‌ హీరోయిన్లకంటే చాలా ఎక్కువ సంపాదించేస్తోందట. అందుక్కారణం.. ఆమె వరుసగా చేస్తోన్న సినిమాలేనట. సీనియర్‌ హీరోతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ ఎలా వుంది.? అనడిగితే, ఆ సమయంలో.. ‘అక్కడున్నది హీరో.. నేను హీరోయిన్‌..’ అని మాత్రమే ఆలోచిస్తానంటోందీ స్టన్నింగ్‌ బ్యూటీ.

 

తెలుగులో మళ్ళీ సినిమా ఎప్పుడు.? అని ప్రశ్నిస్తే, ‘అతి త్వరలో’ అని చెప్పిందిగానీ, పూర్తిస్థాయి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఆన్‌ స్క్రీన్‌ హాట్‌ అప్పీల్‌ గురించి ప్రశ్నించినప్పుడు, ‘గ్లామర్‌ కూడా యాక్టింగ్‌లో ఓ పార్ట్‌..’ అంటూ తనదైన స్టయిల్లో సమాధానమిచ్చింది కైరా అద్వానీ.

ALSO READ: జ‌వాన్ గా మార‌బోతున్న రౌడీ