ENGLISH

సుచీ లీక్స్‌: ఛలో లండన్‌

08 March 2017-17:13 PM

ఈ మధ్య తమిళ గాయని సుచిత్ర ట్విట్టర్‌ అకౌంట్‌లో కోలీవుడ్‌ ప్రముఖుల అసభ్యకర ఫోటోలు, వీడియోలు లీక్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోలీవుడ్‌లో రచ్చ రచ్చ జరిగిపోతోంది. కోలీవుడ్‌లో ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ఫోటోలు, వీడియోలతో పాటు కోలీవుడ్‌ ప్రముఖులపై ట్విట్టర్‌ వేదికగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సుచిత్ర మానసిక పరిస్థితి సరిగా లేదనీ, అందుకే ఆమె ఈ రకంగా ప్రవర్తిస్తోందనీ ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగా ఆమెను చికిత్స కోసం లండన్‌ తీసుకెళ్లే ఆలోచనలో ఆమె భర్త కార్తీక్‌ ఉన్నారనీ తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సుచిత్ర చెన్నైలో ఉన్నారు. త్వరలోనే లండన్‌ వెళ్లనున్నారట. ఆమె కుటుంబ సభ్యులు ఆమె మానసిక పరిస్థితిని తెలుసుకుని అందుకు తగ్గ చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారట. హీరో థనుష్‌ని టార్గెట్‌గా చేసుకుని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌, ఆండ్రియా, త్రిషా, రానా తదితరులపై కూడా ఆమె వివాదాస్సద వ్యాఖ్యలు చేయడంతో పాటు, వారి పర్సనల్‌ వీడియోలు కూడా సుచిత్ర ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. దేశ వ్యాప్తంగా సెన్సేషనల్‌ అయిన ఈ న్యూస్‌పై ఆమె భర్త కార్తీక్‌ స్పందించి సదరు ప్రముఖులకు క్షమాపణ తెలియజేశారు.

ALSO READ: రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది గురూ!