ENGLISH

'మణికర్ణిక' సెట్‌లో క్రిష్‌ బర్త్‌డే వేడుకలు

10 November 2017-16:19 PM

క్రిష్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌లో 'మణికర్ణిక' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. కాగా ఈ రోజు డైరెక్టర్‌ క్రిష్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా హీరోయిన్‌ కంగనా రనౌత్‌, సెట్స్‌లో క్రిష్‌కి స్పెషల్‌గా పార్టీ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. 

క్రిష్‌ కోసం చాకొలెట్‌ కేక్‌ని ఆర్డర్‌ చేయించింది. ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చినందుకు క్రిష్‌, కంగనాకి థాంక్స్‌ చెప్పాడు. సోషల్‌ మీడియాలో కంగనాతో కలిసి ఉన్న ఫోటోని పోస్ట్‌ చేసి, ఈ విషయాన్ని తెలిపారు క్రిష్‌. 'బాహుబలి' వంటి అత్యద్భుతమైన ఫాంటసీ స్టోరీని అందించిన విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకి కథనందించారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోరది. చారిత్రాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో క్రిష్‌కి ప్రత్యేక స్థానం ఉంది. బాలయ్యతో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాని అనుకున్న టైంకి, అనుకున్న బడ్జెట్‌లో అద్భుతంగా తెరకెక్కించాడు క్రిష్‌. ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హిస్టారికల్‌ మూవీ ఇదే. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ పాత్రలో కంగనా నటిస్తోంది. 

ఈ సినిమా కోసం కంగనా కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఇప్పటికే సినిమా చాలా వరకూ చిత్రీకరణ పూర్తయ్యింది. ఔట్‌పుట్‌ చాలా బాగా వస్తోందని ఇన్‌ సైడ్‌ సోర్సెస్‌ సమాచారమ్‌. పోరాట ఘట్టాలకు ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. ఝాన్సీ లక్ష్మీభాయ్‌ చరిత్రను మనుసుకు హుత్తుకునేలా విజువల్‌గా తెరకెక్కిస్తున్నాడు క్రిష్‌ . వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: ఒక్కడు మిగిలాడు రివ్యూ రేటింగ్స్