సెన్సిటీవ్ సినిమాలతో తనదంటూ ఓ ముద్ర వేశాడు క్రిష్. ఇప్పుడు... `కొండపొలెం` అనే నవలని సినిమాగా తీస్తున్నాడు.ఆ సినిమాకీ కొండపొలెం అనే పేరే పెట్టాడు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా ఇది. షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించారు. అక్టోబరు 8న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటన ఈరోజు వచ్చింది.
తానా నవలల పోటీల్లో బహుబతి పొందింది `కొండపొలెం`. అటవీనేపథ్యంలో సాగే ఈ నవలని సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించారు. ఈ సినిమాలో పులిదీ ఓ ప్రత్యేకమైన పాత్ర. పులితో హీరో చేసే పోరాటాలు... ఒళ్లు గగుర్పాటుకి గురి చేసేలా తీర్చిదిద్దారని తెలుస్తోంది. గ్రాఫిక్స్ కోసమే కొన్ని నెలలు కష్టపడ్డారు. ఇవన్నీ వెండి తెరపై ఎలా వచ్చాయో తెలియాలంటే అక్టోబరు 8 వరకూ ఆగాలి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.
ALSO READ: 'కనబడుటలేదు' మూవీ రివ్యూ & రేటింగ్!