ENGLISH

పెళ్లి పీటలెక్కనున్న తీన్మార్ బ్యూటీ

07 March 2024-14:37 PM

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ , మాలీ వుడ్ లలో హీరో, హీరోయిన్స్ అంతా పెళ్లి పీటలెక్కుతున్నారు. ప్రజంట్  పెళ్లిళ్ల సీజన్ హీరోయిన్స్ పెళ్లికి సీజన్ లా ఉంది. వరుసగా అందరు హీరోయిన్స్ తమకి నచ్చిన వారిని పెద్దల సమ్మతం తో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు.  ఫాన్స్ మాత్రం కొంచెం నిరాశకి గురి అవుతున్నారు. తమ ఫెవరేట్ ముద్దుగుమ్మలు పెళ్ళిలైఫ్ తో సినిమాలకి బ్రేక్ ఇస్తారని. రకుల్ ఇప్పటికే పెళ్లి చేసుకుంది. జాదూగాడు, ఈడో రకం ఆడో రకం,స్పీడున్నోడు సినిమాల్లో నటించిన 'సోనారికా' కూడా ఫిబ్రవరి 18  న పెళ్లి చేసుకుంది.  వరలక్ష్మి శరత్ కుమార్ రీ సెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుంది. త్వరలో తాప్సి కూడా పెళ్లి పీటలెక్కనుంది. వీరి బాటలోనే ఇంకో హీరోయిన్ కూడా పెళ్ళికి రెడీ అయ్యింది. ఆమే కృతి కర్బందా.


బోణి, సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ నార్త్ భామ. తరవాత పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన 'తీన్ మార్' సినిమాలో పవన్ కి  జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరవాత మంచు మనోజ్ తో  Mr. నూకయ్య, రామ్ పోతినేని తో  ఒంగోలు గిత్త, బ్రూస్లీ లాంటి సినిమాల్లో నటించింది. తరవాత టాలివుడ్ లో అవకాశాలు లేక బాలీవుడ్ లో నటిస్తోంది. కెరియర్ ఫామ్ లో లేకపోవటంతో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 2019 నుంచి కృతి ఖర్బందా, బాలీవుడ్ యంగ్ హీరో  పుల్కిత్ సామ్రాట్ తో రిలేషన్ లో ఉంది. కొన్ని నెలల క్రితమే వీరిద్దరూ తమ ప్రేమని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.


జనవరిలో సీక్రెట్ గా నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట ఇప్పుడు మార్చ్ 15న పెళ్లి చేసుకోనున్నట్టు బాలీవుడ్ మీడియా న్యూస్. మార్చ్ 13 న వీరి పెళ్లి జరగనున్నట్లు, మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయని, ఈ వేడుకలకి ఢిల్లీ వేదిక కానుందని టాక్. కేవలం కుటుంబ సభ్యులు , సన్నిహితులు మధ్య ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయని, పెళ్లి తరవాత ముంబైలో రిసెప్షన్ ఉంటుందని సమాచారం.  వీరి వెడ్డింగ్ కార్డు అంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  దీనితో వీరికి అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్తున్నారు.