ENGLISH

రీల్ కోసం రియల్ బావా మరదలు?

07 March 2024-14:29 PM

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక  వారసురాలు నిహారిక. మొదట టెలివిజన్  కార్య క్రమాలతో తన ప్రయాణం మొదలు పెట్టి, తరవాత వెండి తెరపైకి అడుగు పెట్టింది. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ని కూడా స్థాపించింది.  ఈ బ్యానర్ లో వచ్చినవే  'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' లాంటి  సిరీస్‌లు. 'ఒక మనసు' మూవీతో నాగసౌర్య తో కలిసి తెరంగేట్రం చేసింది. నిహారిక హీరోయిన్ గా చేసిన సినిమాలు ఏవి తనకి కలిసి రాలేదు. తరవాత వివాహబంధంలోకి అడుగు పెట్టింది. అదీ కలిసి రాకపోవటంతో విడాకులు తీసుకుని మళ్ళీ సినీ జీవితం మొదలు పెట్టింది.


విడాకులు తరవాత 'డెడ్ ఫిక్సల్' సిరీస్‌లో  నటించింది. పెళ్ళికి ముందు నత్త నడకలా ఉన్న తన కెరియర్ ని గాడిలో పెట్టేందుకు ప్రీ ప్లేన్డ్ గా జోరు  పెంచింది. ఈ నేపథ్యం లోనే   కొన్ని వెబ్ సిరీస్‌లతో పాటు పలు చిత్రాలకు  గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఆహాలో ప్రసారం అవుతోన్న 'చెఫ్ మంత్ర' షోను కూడా హోస్ట్ చేస్తోంది. అంతే కాదు వెండి తెరపై మెరిసేందుకు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో కలిసి ఓ క్రేజీ  ప్రాజెక్ట్ కి కూడా ఓకే చెప్పిందని టాక్.


ఉప్పెన తరవాత వైష్ణవ్ కి ఆశించిన స్థాయిలో విజయం రాలేదు. కష్ట పడినా ఫలితం రాలేదు. నిహారిక కి కూడా చెప్పుకో దగ్గ హిట్ లేదు ఇప్పుడు ఈ బావా, మరదలు ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి తమ లక్ ని పరీక్షించుకోనున్నారు. ఈ మూవీని ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని ఫిలిం నగర్ సమాచారం. డిఫరెంట్ లవ్ స్టోరీతో  గతంలో ఏ తెలుగు సినిమాలోనూ చూపించని పాయింట్‌తో ఈ మూవీ రూపొందనుందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందని టాక్. టాలీవుడ్‌లో ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.