ENGLISH

రత్తాలు బన్‌గయా 'అందాల నాగిని'

31 August 2018-12:20 PM

నాగిని పాత్రలు వెండితెరకు కొత్తేమీ కాదు. ఈ మధ్యకాలంలో అయితే ఈ తరహా పాత్రలు చాలా తక్కువగానే వెండితెరపై కనిపిస్తున్నాయి. బుల్లితెరపై మాత్రం 'నాగిని' సీరియల్‌ ఓ రేంజ్‌లో ప్రభంజనం సృష్టించేస్తోంది. మూడో సీక్వెల్‌ నడుస్తోంది ఈ సీరియల్‌కి సంబంధించి తాజాగా. హిందీలో రూపొందిన ఈ సీరియల్‌, తెలుగులోనూ ఇతర భాషల్లోనూ బుల్లితెర వీక్షకుల్ని అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసినదే. 

అసలు విషయమేంటంటే 'రత్తాలు' అదేనండీ, అందాల భామ రాయ్‌ లక్ష్మీ నాగిని గెటప్‌లో కన్పించబోతోంది. 'నీయా-2' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. తమిళ హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా నాగిని గెటప్‌లోనే కన్పించబోతుండడం గమనించాల్సిన విషయం. నాగిని పాత్రకు సంబంధించి వరలక్ష్మి శరత్‌కుమార్‌ గెటప్‌ని తాజాగా రివీల్‌ చేశారు. రాయ్‌లక్ష్మీ గెటప్‌ని సైతం లేటెస్ట్‌గా విడుదల చేశారుగానీ, అందులో నాగిని గెటప్‌లో కన్పించడంలేదామె. సాంకేతికంగా అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. 

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. హిందీలోనూ విడుదల చేసే సన్నాహాల్లో వున్నారు. ముందుగా ఈ సినిమాని ఓ మోస్తరు బడ్జెట్‌తో ప్లాన్‌ చేసినా, ఇదిప్పుడు ఇండియన్‌ మూవీ అనే స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోందట. పాము కథ అంటే అది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. రివెంజ్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే వుంటాయి ఈ తరహా సినిమాలు. 

బుల్లితెరపై 'నాగిని' ఒక్కటే కాదు, చాలా సీరియల్స్‌ నాగకన్య నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. వాటికి జనాదరణ కూడా లభిస్తోంది. సో, 'నీయా-2' కూడా సంచలన విజయాన్ని అందుకోవచ్చు.

 

ALSO READ: ప్రముఖ మహిళా దర్శకురాలు కన్నుమూత..!