ENGLISH

రత్తాలూ - బోల్డ్‌, బ్యూటిఫుల్‌ అండ్‌ బ్లెస్డ్‌

30 August 2017-13:52 PM

మెగాస్టార్‌తో 'రత్తాలు..రత్తాలు..' అంటై ఐటెం సాంగ్‌లో చిందేసిన రాయ్‌ లక్ష్మీ ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో 'జూలీ-2' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అమ్మడు రెచ్చిపోయింది. అసలే రాయ్‌ లక్ష్మీది మెరిసిపోయే అందం. మత్తెక్కించే ఫిగర్‌. మిల్క్‌ కలర్‌ స్కిన్‌తో ఆమె స్కిన్‌ షో చేసిందంటే అంతే సంగతి. అదే ఇప్పుడు 'జూలీ - 2' సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ చేయబోతోంది. ఇంతకు ముందెన్నడూ లేనంత హాట్‌గా తనలోని గ్లామర్‌ని ప్రదర్శనకి పెట్టేసింది ఈ సినిమా కోసం. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే బికినీల జాతర. ఏకంగా 100 రకాల బికినీల్లో అమ్మడు తన అందాలని విందు చేయబోతోందట. అందుకోసం 15 కిలోల బరువు కూడా తగ్గింది. అసలే కొలత తగ్గించేసిన దుస్తులు, ఆపై అవి కూడా దండగన్నట్లుగా వాటినీ 'వలిచేయడం' చూపించేశారు టీజర్‌లో. టీజరే ఇలా ఉంటే ట్రైలర్‌ ఇంకెలా ఉంటుందో, సినిమా అసలెలా ఉంటుందో! రత్తాలు అల్టిమేట్‌ హాట్‌నెస్‌ని అయితే 'జూలీ-2' సినిమాలో చూసెయ్యొచ్చు. పదమూడేళ్ళ క్రితం 'జూలీ' సినిమా వచ్చింది. అందులో నేహా ధూపియా గ్లామర్‌ ఇప్పటికీ చాలామందికి గుర్తుంది. ఆ రేంజ్‌లో గ్లామర్‌ ప్రదర్శించాలనే రాయ్‌ లక్ష్మీని ఏరి కోరి ఎంచుకున్నారట ఈ సినిమా కోసం. మరి దాన్ని మరిపించాలంటే రత్తాలు ఈ స్థాయిలో రెచ్చిపోవాల్సిందే తప్పదు.

 

ALSO READ: JULIE 2 | TEASER TRAILER