ENGLISH

మెగా మేనల్లుడు ఈసారేంచేస్తాడో?

27 April 2018-07:00 AM

వరుస ఫ్లాపులతో మెగా ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ తాజాగా కరుణాకరన్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఫస్ట్‌ సైట్‌' అంటూ ఈ సినిమా ప్రీ లుక్‌ని విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ 28న విడుదల కానుంది. ఇదొక యాక్షన్‌ ప్యాక్‌డ్‌ లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌తో 'తొలిప్రేమ' సినిమాని తెరకెక్కించిన కరుణాకరన్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి, తర్వాత 'బాలు' చిత్రంతో ఫ్లాప్‌ చవి చూశాడు.

 

మెగా కాంపౌండ్‌లోనే అల్లు అర్జున్‌తో 'హ్యాపీ' చిత్రంతో మరో హిట్‌ కొట్టాడు. ప్రబాస్‌తో 'డార్లింగ్‌' మరో పెద్ద హిట్‌ రుణాకరన్‌ ఖాతాలో ఉంది. ఇవేకాదు, 'ఎందుకంటే ప్రేమంట' తదితర ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు కరుణాకరన్‌. ఇంత ట్రాక్‌ రికార్డున్న ఈయన పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమాని. అందుకే మెగా మేనల్లుడితో తెరకెక్కిస్తున్న ఈ తాజా చిత్రంపై పవన్‌ కళ్యాణ్‌ ఇంపాక్ట్‌ చాలా ఎక్కువగా ఉండనుందట. మెగాబ్రదర్స్‌కి ముద్దుల మేనల్లుడు కావడంతో, తేజుతో తీయబోయే చిత్రంపై కొంచెం ఎక్కువగా కాన్‌సన్‌ట్రేషన్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

 

అంతేకాదు, వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సాయి ధరమ్‌ తేజ్‌కి ఎలాగైనా హిట్‌ అందించాలనే కసితో ఉన్నాడట కరుణాకరన్‌. ఆ దిశగానే ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్‌ప్లే ప్రిపేర్‌ చేశాడనీ తెలుస్తోంది. అనుపమా పరమేశ్వరన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంతోనైనా మెగా మేనల్లుడు హిట్‌ కొట్టి రేసులోకి దూసుకొస్తాడో లేదో చూడాలిక.

ALSO READ: గ్లామ్‌షాట్‌: మనసుకు నచ్చిన గ్లామరే కానీ..!