ENGLISH

నాకు హీరోలు ముఖ్యం కాదు

31 March 2021-12:00 PM

చిత్ర‌సీమ హీరోల చుట్టూనే తిరుగుతుంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులొస్తేనే.. హీరోయిన్లు చ‌క చ‌క ఎదుగుతారు. అందుకే హీరోయిన్లు కూడా వాళ్ల పేరే జ‌పిస్తుంటారు. కానీ లావ‌ణ్య త్రిపాఠి మాత్రం `హీరోల చేతుల్లో ఏం లేదు..` అంటోంది. ``అవును.. హీరోల చేతుల్లో ఏం ఉండ‌దు. ఏం సృష్టించాల‌న్నా ద‌ర్శ‌కులతోనే. స‌రికొత్త పాత్ర‌లు వాళ్లే రాస్తారు. అలాంటి సినిమాల్లో అవ‌కాశాల కోసమే నేను క‌ల‌లు కంటాను.

 

ఫ‌లానా హీరోతో ఓ సినిమా చేయాలి.. అని ఎప్పుడూ అనుకోను. ఫ‌లానా ద‌ర్శ‌కుడితో ప‌నిచేయాలి. అనుకుంటా`` అని అస‌లు సిస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేసింది. తాను ప‌నిచేయాల‌నుకున్న ద‌ర్శ‌కుల పేర్ల‌యితే చాలానే ఉన్నాయ‌ట‌. అవ‌న్నీ చెప్పాలంటే.. ఓ పేజీ స‌రిపోదు.. అంటోంది. ఈమ‌ధ్యే `ఏ 1 ఎక్స్‌ప్రెస్‌`, `చావు క‌బురు చ‌ల్ల‌గా` సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది లావ‌ణ్య‌. రెండు సినిమాలూ అంతంత మాత్రంగానే ఆడినా... త‌న‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి.

ALSO READ: Lavanya Tripathi Latest photoshoot