ENGLISH

లైగ‌ర్‌... రిలీజ్ డేట్ ప‌క్కా!

11 February 2021-14:28 PM

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ మూవీ.. `లైగ‌ర్‌`. అన‌న్య పాండే క‌థానాయిక‌. `సాలా క్రాస్ బ్రీడ్‌` అనేది ఈ సినిమా క్యాప్ష‌న్. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సెప్టెంబ‌రు 9న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

 

సెప్టెంబ‌ర్ 9న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ స‌హా మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లోను రిలీజ్ చేస్తారు. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెర‌కెక్కుతున్న క‌థ ఇది. విజ‌య్‌.. బాక్స‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. సినిమా దాదాపుగా ముంబైలోనే సాగుతుంది. కొత్త షెడ్యూల్ అతి త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఛార్మి, క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ALSO READ: దిల్ రాజుకి చిక్కిన క్రేజీ కాంబో