ENGLISH

ర‌జ‌నీ బ‌యోపిక్‌... హీరో ఎవ‌రంటే..?

09 November 2020-18:04 PM

ఇది బ‌యోపిక్‌ల జ‌మానా. ఎవ‌రి క‌థ‌... క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అవుతుందో చూసుకుని, వాళ్ల క‌థ‌ల్ని సినిమాలుగా మార్చ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు రెడీ అయిపోతున్నారు. హీరోలు, క్రికెట‌ర్లు, రాజ‌కీయ నాయ‌కుల జీవితాలు బ‌యోపిక్‌కి మంచి స‌రుకులు. అందుకే.. ద‌ర్శ‌కుల దృష్టి వీళ్ల‌పైనే ఉంటుంది. తాజాగా.. ర‌జ‌నీకాంత్ జీవితంపై కూడా ఓ సినిమా వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయంటూ... కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

 

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లింగు స్వామి.. ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యార‌ని టాక్‌.ఇందులో హీరోగా.. ర‌జనీ అల్లుడు ధ‌నుష్ అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈ విష‌యంలో ధ‌నుష్‌ని లింగు స్వామి ఇప్ప‌టికే సంప్ర‌దించాడ‌ని, `స్క్రిప్టు పూర్త‌య్యాక‌.. ఏ విష‌య‌మూ చెబుతా` అని ధ‌నుష్ మాటిచ్చాడ‌ని కోలీవుడ్ టాక్‌. నిజానికి ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి ముందు బ‌యోపిక్ తీసుకురావాల‌ని భావించారు. అయితే ర‌జ‌నీ ఇప్ప‌ట్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని తేలిపోయింది. అలాంట‌ప్పుడు ర‌జ‌నీ బ‌యోపిక్‌కి ఒప్పుకుంటారా? అన్న‌ది అనుమాన‌మే. ఈ క‌థ ధ‌నుష్‌కి న‌చ్చితే.. ర‌జ‌నీ మాత్రం కాద‌న‌క‌పోవొచ్చు. అల్లుడు కోసం.. త‌న క‌థని ఇచ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ALSO READ: ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ఫిక్సా..?