ENGLISH

'మారి 2' ఇరగదీసిన సాయిపల్లవి.!

05 December 2018-15:56 PM

తమిళంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాల్లో ఒకటిగా 'మారి 2' విడుదలకు ముందు అందరి దృష్టినీ ఆకర్షించింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. సూపర్‌స్టార్‌ తర్వాత ఆ స్థాయి స్టైలింగ్‌ ఉన్న హీరోగా ధనుష్‌ గుర్తింపు పొందాడు. విలక్షణ సినిమాలను ఎంచుకోవడం ధనుష్‌ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో 'మారి 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుండీ లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకూ ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ అనేలా ఉంది.

మాస్‌ ఊరమాస్‌ ట్రైలర్‌ అనిపించుకుంది 'మారి 2' ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే. ఈ ట్రైలర్‌లో ధనుష్‌ స్టైలింగ్‌, మాస్‌ అప్పియరెన్స్‌ ఒక ఎత్తు అయితే సాయి పల్లవి అప్పియరెన్స్‌ ఇంకో ఎత్తు. తన అప్పియరెన్స్‌తో ట్రైలర్‌కు విపరీతమైన గ్లామర్‌ తెచ్చింది. సాయి పల్లవి ఈజ్‌ ఈ ట్రైలర్‌కి మరో ఆకర్షణ. హీరోని హీరోయిన్‌ టీజ్‌ చేయడం, ఆ హీరోయిన్‌ సాయి పల్లవి అవ్వడం తెలుగు సినిమాల్లో ఇప్పటికే చూసేశాం. తమిళ ప్రేక్షకులకు ఆ కిక్‌ 'మారి 2'తో దొరకనుంది.

ఈ సినిమా కోసం చిత్రీకరించిన ఓ మాస్‌ సాంగ్‌లో డాన్సింగ్‌ సెన్సేషన్‌ అయిన ధనుష్‌కే పోటీ ఇచ్చింది సాయి పల్లవి. ట్రైలర్‌లో ఈ పాటకు సంబంధించి చిన్న బిట్‌ మాత్రమే జోడించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో సాయి పల్లవి ప్రస్తుతం 'పడి పడి లేచె మనసు'లో సినిమా రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

ALSO READ: ఫోర్బ్స్ లిస్ట్ 2018: సంపాదనలో మహేష్ ని మించిన ఎన్టీఆర్..!