ENGLISH

'బిగ్‌బాస్‌'పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

21 June 2018-18:17 PM

బుల్లితెర మెగా రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 2 టాక్‌ ఆఫ్‌ ది తెలుగు స్టేట్స్‌గా మారింది. ఈ షోకి సంబంధించిన విషయాలపై జనం ఆశక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే టీఆర్‌పీ రేటింగ్స్‌ పరంగా చూసినప్పుడు గత సీజన్‌ కంటే కొంచెం వెనకబడే ఉందని ప్రచారం జరుగుతోంది.

 

ఆ సంగతి పక్కన పెడితే, గత సీజన్‌కి భిన్నంగా ఈ సీజన్‌లో పార్టిసిపెంట్స్‌ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సంజన ఫస్ట్‌ వీక్‌ ఎలిమినేట్‌ అయ్యింది. వీకెండ్‌ మళ్లీ వచ్చేస్తోంది. ఇంకొకరు బయటికి వెళ్లక తప్పదు. బిగ్‌ హౌస్‌లో ఎవరుండాలి? ఎవరుండకూడదు? అనేది పూర్తిగా ఓటింగ్‌ మీదనే ఆధారపడదనీ, కంటెస్టెంట్స్‌లో ఎవరికి నిర్వాహకులు ఎక్కువ సొమ్ము చెల్లించి రప్పించారో వాళ్లే ఎక్కువ కాలం హౌస్‌లో ఉండొచ్చని సినీ నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ఈమెను కూడా నిర్వాహకులు సంప్రదించారట. అయితే వారి తీరు నచ్చక నో చెప్పానని మాధవీలత వెల్లడించింది. ఎలాగైనా గెలవడం కోసం అడ్డదారులు తొక్కడం సబబు కాదని మానవత్వమే ముఖ్యమన్న విషయాన్ని కంటెస్టెంట్స్‌ మర్చిపోకూడదని మాధవీలత సూచనలాంటి క్లాస్‌ తీసుకుంది కంటెస్టెంట్స్‌కి. తొలి సీజన్‌ని హోస్ట్‌గా ఎన్టీఆర్‌ రక్తి కట్టిస్తే, ఆ స్థాయిలో అలరించేందుకు నాని కష్టపడుతున్నా, ఇంకా రావాల్సిన స్థాయిలో నాని ఎపిసోడ్స్‌కి హైప్‌ రావడం లేదు.

 

ALSO READ: బిగ్ బాస్ TRPలు పడిపోయాయట