ENGLISH

సుచీ లీక్స్‌ - మడోనా హ్యాకింగ్‌

09 March 2017-11:08 AM

'ప్రేమమ్‌' సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా నటించిన మడోనా సెబాస్టియన్‌ ఫేస్‌బుక్‌ పేజీ హ్యాకింగ్‌కి గురయ్యిందట. తమిళ, మలయాళ, తెలుగు సినీ పరిశ్రమలో సుచీ లీక్స్‌ ప్రకంపనలు సృష్టిస్తుండగా మడోనా హ్యాకింగ్‌తో ఆందోళన ఇంకా పెరిగింది. అయితే సుచీ లీక్స్‌లా మడోనా హ్యాకింగ్‌ ఇంతవరకు ఎలాంటి దుమారం సృష్టించలేదు. తన పేజీని ఎవరో హ్యాక్‌ చేసినట్లుగా తెలుసుకున్నాననీ, దాని ద్వారా వచ్చే మెసేజ్‌లను విశ్వసించరాదని ముందుగానే జాగ్రత్తపడింది మడోనా సెబాస్టియన్‌. తెలుగులో తొలి చిత్రంతోనే ముద్దుగా బొద్దుగా తెలుగు ప్రేక్షకుల్ని ఈ భామ అలరించింది. ఇంకో వైపున సుచీ లీక్స్‌ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. బూతు వీడియోలు, ఫొటోలు సుచీ లీక్స్‌ హ్యాష్‌ టాగ్‌ ద్వారా ఇంటర్నెట్‌ అంతటా విస్తరించాయి. సింగర్‌ సుచిత్రకి చెందిన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఇవి ముందుగా పాపులర్‌ అయ్యాయి. వీటిని సుచిత్ర స్వయంగా పంపిందనే విమర్శ ఉండగా, ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని భర్త కార్తీక్‌ వివరణ ఇచ్చాడు. మానసిక ప్రశాంతత కోసం సుచిత్రను లండన్‌కి తీసుకెళ్ళారట. ఏదేమైనప్పటికీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో సరదా సరదాగా అభిమానులతో కాలక్షేపం చేసే రోజులు పోయాయి. వాటి స్థానంలో సెలబ్రిటీలు భయాందోళనలు చెందే పరిస్థితులు రావడం శోచనీయం.

ALSO READ: చిరు వినాయక్ కి ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏంటో తెలుసా?!