ENGLISH

'సావిత్రి' జీవిత చరిత్రకి లైన్‌ క్లియర్‌

08 March 2017-16:57 PM

తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం తరతరాలు గర్వించే మహా నటి సావిత్రి కథ అని పేర్కొంటూ 'సావిత్రి' సినిమా అనౌన్స్‌మెంట్‌ జరిగింది. వైజయంతీ మూవీస్‌ సమర్పణలో, స్వప్న సినిమా బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది. నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రీ లుక్‌ పోస్టర్‌లో అలనాటి మేటి నటి సావిత్రి, అలాగే బ్యాక్‌ గ్రౌండ్‌లో నేటి తరం నటీమణులు కీర్తి సురేష్‌, సమంత దర్శనమిస్తున్నారు. టైటిల్‌ రోల్‌ అంటే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటించనుందని సమాచారమ్‌. సమంత మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుందట. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుంది? మిగతా తారాగణం ఎవరు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. సావిత్రి అంటే తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న మహా నటి. మహా నటి అన్న పదానికే ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌. ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించడమంటే చాలా పెద్ద సాహసం అది. నటీనటుల ఎంపికే ఇందులో చాలా కీలకం. అన్ని రకాలుగా ఆలోచించి నటీనటుల ఎంపిక చేసినట్లు తెలియవస్తోంది. ముందుగా ఈ సినిమా కోసం విద్యాబాలన్‌, నిత్యామీనన్‌ తదితరుల పేర్లను పరిశీలించారు. చివరికి కీర్తి సురేష్‌, సమంతలను ఫైనల్‌ చేశారట. 

 

ALSO READ: అక్కినేని అమలకు అత్యున్నత పురస్కారం!