ENGLISH

మహేష్‌ బర్త్‌డే పోటెత్తిన సోషల్‌ మీడియా

09 August 2018-12:27 PM

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియా విషెష్‌తో పోటెత్తింది. అభిమానులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు మహేష్‌కి బర్త్‌డే విషెస్‌ అందిస్తున్నారు. బర్త్‌డే సందర్భంగా అభిమానులకు మహేష్‌ అందించిన గిఫ్ట్‌ అదిరిపోయింది. కొత్త సినిమా టైటిల్‌ లోగోతో పాటు, చిన్నపాటి టీజర్‌ని కూడా విడుదల చేసి, అభిమానుల్ని ఫుల్‌ ఖుషీ చేశాడు మహేష్‌బాబు. 

దాంతో అభిమానుల నుండి ఓ పక్క టీజర్‌ రెస్పాన్స్‌, మరో పక్క బర్త్‌డే విషెస్‌ దద్దరిల్లిపోతున్నాయి. 'మహర్షి' అనే సౌండింగ్‌కి ఉన్న క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో 'మహర్షి' సినిమాతో రాఘవ హీరోగా ఓ సినిమా రూపొందింది. అప్పట్లో సంచలన విజయం అందుకుంది ఆ సినిమా. యూత్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ సినిమాలో హీరోగా నటించిన రాఘవ ఆ తర్వాతి నుండి 'మహర్షి రాఘవ'గా పాపులర్‌ అయిపోయాడు. అదీ ఆ టైటిల్‌కున్న క్రేజ్‌. 

అసలే మహేష్‌.. ఆ పేరులోనే వైబ్రేషన్స్‌. అమ్మాయిల హృదయాల్లో పదిలమైన గూడు కట్టేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు మహర్షిగా రాబోతున్నాడు. నిన్న 'భరత్‌ అనే నేను' అంటూ స్మార్ట్‌ లుక్‌లో కనిపించి అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టేశాడు. ఇప్పుడు 'మహర్షి' అంటూ కొంచెం మాస్‌ టచ్‌ ఉన్న రొమాంటిక్‌ లుక్స్‌తో అప్పుడే గుండెల్లో గుబులు పుట్టించేస్తున్నాడు. 

చూడాలి మరి 'మహర్షి'తో ముందు ముందు మహేష్‌ సృష్టించే వైబ్రేషన్స్‌ ఎలా ఉండబోతున్నాయో. మొత్తానికి మహేష్‌ బర్త్‌డే గిఫ్ట్‌ సూపరో సూపరే.!

ALSO READ: శోభితపై మహేష్‌ ఫ్యాన్స్‌ బూతుల ప్రవాహం.?