ENGLISH

యాక్ష‌నూ ఉంద‌ని హింట్ ఇచ్చావా మ‌హేషా..?

02 March 2023-12:12 PM

త్రివిక్ర‌మ్ సినిమా అంటే... కుటుంబం అంతా స‌ర‌దాగా క‌లిసి చూసేలా ఉంటుంది.యాక్ష‌న్ సీన్లు ఉంటాయి కానీ.. అవి కూడా క్లాస్ గా ఉంటాయి. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. ఇది కూడా ఫ్యామిలీ డ్రామా స్టోరీనే అని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. దానికి తోడు అత్తారింటికి దారేది క‌థ ఇద‌ని, తాతా - మ‌న‌వ‌ళ్ల స్టోరీ అంటూ లీకులు వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకొంటే ఇదో క్లీన్‌, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలిసిపోతుంది.

 

అయితే ఇందులో యాక్ష‌న్‌కి చోటు లేదా? అనే అనుమానాలు రావొచ్చు. వాటిని నివృత్తి చేయ‌డానికి మ‌హేష్ ఇప్పుడు కొన్ని పిక్స్ వ‌దిలాడు. జిమ్ లో క‌స‌ర‌త్తు చేస్తున్న ఫొటోల్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఇదంతా త్రివిక్ర‌మ్ సినిమా కోసం చేస్తున్న క‌స‌ర‌త్తు అంటూ హింట్ ఇచ్చాడు. దాంతో ఈ సినిమాలో యాక్ష‌న్‌కీ పెద్ద పీట వేశార‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. సో... యాక్ష‌న్ ప్రియుల‌కు, ముఖ్యంగా మ‌హేష్ అభిమానుల‌కు పండగే అనుకోవాలి. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకొంది. త్వ‌ర‌లోనే భారీ షెడ్యూల్ కి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ఈ షెడ్యూల్ లోనే యాక్ష‌న్ పార్ట్ కూడా ఉండొచ్చ‌ని తెలుస్తోంది.